Friday, September 25, 2015

THREE HUNDRED POEMS IN TELUGU
WITH ENGLISH TRANSLATION

వాణి త్రిశతి














151.


సత్ప్రవర్తన యన సత్సంగ మొకటేన 

సూక్తి చెప్పు వాడు సజ్జనుండె

సూక్తి వినెడి వాడు శుద్ధి యెపుడగునొ

వాణి బలుకు మాట నాదునోట!  


తాత్పర్యము (తా):
కేవలం సత్సంగాలు జరిపి సూక్తులు వింటే సత్ప్రవర్తన వస్తుందాసూక్తులు చెప్పేవాడు సత్ప్రవర్తన కలిగిన వాడేనా అని మనం ఎప్పుడైనా చూస్తున్నామాఇంతకీ సూక్తులు వినేవాడు ఎప్పటికి సద్బుద్ధి నేర్చుకో కలుగుతాడు?

English:

Just by attending religious meetings, do people become sacrosanct? Is the person preaching morals, himself moralist? When does the one that hears the teachings turn to better life?


152.



ఆస్తికుడు జూచు దేవుని నాస్తి యందు

నాస్తికునికి లేదు దైవ నమ్మకంబు 

కాటి కేగుచొ కాల్చెడి కట్టె యొకటె

తేట బలికెను  బాణి నాదు వాణి!  

తాత్పర్యము (తా):

ఆస్తికుడు "శూన్యంలొభగవంతుడిని చూస్తాడునాస్తికుడు దైవం కనబడ్డా నమ్మనంటాడువీరిద్దరూ ఎంత వాదులాడుకున్నాకాల్చే కట్టె మాత్రం ఒకటే.

English:

A Theist sees God in “nothingness”. An Atheist does not believe God even if He stands in front of him. Whatever be their arguments during life time, the wood that burns their body is from the same tree.


153.

తర్క శాస్త్రము చదివినతమ్ముడొకడు 

గువ్వ ముందని తర్కించె గుఱుతు తోడ 

దేవుడెటు గూర్చుండు గుడ్డు పైన

తేట బలికెను  బాణి నాదు వాణి!    


తాత్పర్యము (తా):

తర్కమనేది ఒక వింత వాదనతుది , మొదలూ ఉండదుతర్కం చదివిన వాడు ఎలా అయినా తన వాదన సరి అని రుజువు చెయ్యలని చూస్తాడుగుడ్డు కన్నా గువ్వ ముందని ఋజువుతో  వాదిస్తాడుగుడ్డు ముందైతే దేవుడు  గుడ్డు మీద కూర్చుని గువ్వని సృష్టించాడా అని వాదులాడుతాడు.

English:

Logic is a funny subject. A logician argues in such a way he wins it. He says, the bird came earlier than the egg. To prove his point he says, “how can God sit on egg to produce the chic?”


154.


యెగురు రాబందు ఎంతయొ ఎత్తు పైకి

జూడు కిందను శవముల జాడ కొరకు 

లోభిరాబందు యొకటియె లాభ మెంచ

తేట బలికెను  బాణి నాదు వాణి!  

తాత్పర్యము (తా):

రాబందు ఆకాశంలో ఎంత ఎత్తు ఎగిరినా దాని దృష్టి భూమి మీద తన ఆహారమైన జంతు ళేబరాల మీదే ఉంటుందిఅలాగే లోభి ఎంత సంపాదించిసమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అయినా అతని దృష్టి ఇంకా సంపాదన మీదే ఉంటుంది.

English:

Vulture, though flies high in the skies, its eyes are always on the earth searching for dead bodies. A miser, though he earns immense wealth and flies high in society as a gentleman, his eyes are always on earning more and more.

155.


పల్లె జూసెను ఈర్ష్యతొ పట్న శోభ 

పట్న మేడ్చెను గని పల్లె సుఖము శాంతి 

కలయె పట్నము పల్లెయు ఒకటి కాగ

తేట బలికెను  బాణి నాదు వాణి!  

తాత్పర్యము (తా):

పల్లె ప్రజలు పట్నంలో ప్రజలు అన్ని సౌకర్యాలతో చాలా ఆనందంగా ఉన్నారని అనుకుంటారుపట్న ప్రజలు పల్లెల్లో జనం  విధమైన సమస్యలు లేకుండా చల్లగా జీవిస్తున్నారని అనుకుంటారు రెండూ ఒక దానితో ఒకటి అనుసంధానమయ్యి అందరూ ఒకేలా ఉండే రోజు కలేనా? (కాదుక్రొత్త ప్రభుత్వం తలపెట్టిన అందరికీ ఇళ్ళు కార్యక్రమం సఫలమైతే)

English:

People in rural areas think that with all facilities, townsfolk are happy. Townsfolk think, with less pollution, less traffic, less crime villages are peaceful. Will the dream of intermingling lives in these two come true.( My it be soon with the new government initiative to build houses for all soon)

156.

రాళ్ళు యుండును బియ్యము నిండుగాను 

పట్టి జూసిన తెలియును మోసమెంతొ 

ముసుగు తీయగ తెలియుగ మోస చింత

తేట బలికెను  బాణి నాదు వాణి!  

తాత్పర్యము (తా):

తరచి చూస్తే బియ్యంలో రాళ్ళు కనబడతాయిఅలాగేమనిషి వేసుకున్న మంచితనమనే ముసుగు (mask) తీసి వేస్తే గానినిజ స్వరూపం బయట పడదు.

English:

If we look carefully we can see stones mixed with grains. So too, a man who wears a mask honesty will be exposed to naked truth once, the mask is removed.


157


యేది నిజము కల్ల యెట్టిది గానగ

నిజము వినగ భయము నీకు యేల

నిప్పు లాటి నిజము నిను గాల్చు యొకనాడు

వాణి బలుకు మాట నాదు నొట!  


తాత్పర్యము (తా):

తరచి చూస్తే ఏది నిజముఏది కల్లనిజం విండానికి మనిషి ఎందుకంత భయ పడతాడునిజం నిప్పు లాంటిదినీలో దాగి ఉన్న నిజమే ఏదో ఒక నాడు నిన్ను దహించక తప్పదు.

English:

If you look deep, what is truth, what is a lie? Why is man afraid to face the truth. One day, the truth you hide in yourself will burn you, as naked truth is like fire.


159.


నిజము నిప్పు గాదె నీరున్ను దహియించు

కల్ల కలయు కాదు గరిగి బోవ 

నిజము కల్ల యెపుడు నిలిచుండు ధర లోన

వాణిబలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):

నీరును కూడా దహించే శక్తి ఉన్న నిప్పు లాంటిది నిజముఅబద్ధం కల లాంటిది కాదునిద్ర లేవగానే కరిగి పోవడానికినిజమూఅబద్ధమూ రెండూ కాలమున్నంతవరకూ ఉంటాయి.

English:

Truth is like fire that can burn even water. Lie will not die like a dream when you wake up. Both truth and lie live till the time stops operating.

160.


సాధు వెపుడు బలుకు సాత్వికమ్ము గాను

తప్పు సేయ నతడె తడబడు గదా 

వేఱి మెరుగ డాయె వధకు వ్యధకును

వాణి బలుకు మాట నాదు నోట!  


తాత్పర్యము (తా):

సాధువు అనేవాడుతడబడకుండా సాత్వికంగా మాట్లాడతాడుతప్పు చేసినపుడు అతను కూడా తడబడతాడువధకువ్యధకు తేడా తెలియకుండా మాట్లాడతాడు. (సాధువు అనేది ముసుగు కావచ్చు)

English:

A sacred person, that is honest, never stutters while talking and his words are sweet. The same person, when involved in a crime, stutters and confuses himself between the words “trouble and felony”

161.

నడక నేర్పిన తలి దండ్రి నడక మరచి

కర్ర సాయము తోడను కష్ట పడగ

నీకు సమయము దొరుకదె నడువ తోడు

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):

నీకు నడక నేర్పిన తల్లి,దండ్రులు వయసు మీరి నడక మరచి పోయి కర్ర సాయంతో నడుస్తుంటేకనీసం తోడుగా వెళ్ళడానికి కాసింత సమయం నీకు దొరకదా?

English:

When the parents, that taught you to walk, are walking with the help of a stick, do you not find a little time at least to go with them?

162.


సన్నగుండిన సరి పొల్చి సణుగు వారు

లావు గుండిన గుణుతురు లడ్డు యనుచు

కట్నమిచ్చిన సరి తాళి కట్టమనరె

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):

పిల్ల సన్నగా ఉందని సణిగే వారులావుగా ఉంటే లడ్డులాగా ఉందని ఎగతాళి చేస్తారు కదాకట్నమిస్తే నోరు మూసుకొని కోతి కైనా తాళి కట్టమంటారే?

English:

In the marriage market where groom has a price tag say “she is like straw” if the would be bride is lean and she is like “banyan” trunk if she is fat. If dowry is dangled, the groom silently ties the know even to a monkey.

163.


తండ్రి నాటిన మొలకేమొ బండి పోయె

నీడ నిచ్చె చెట్టు యెండి పోయె

వృద్ధ తల్లిదండ్రి వృద్ధుల యాశ్రమంబు

వాణి బలికెను  మాట నాదు నోట1

తాత్పర్యము (తా):

తల్లిదండ్రులు నాటిన మొలక కాలక్రమంలో పండి పోయింది.నీడ నిచ్చే చెట్టు ఎండి పోయిందినిన్ను పెంచిన వారు ఇప్పుడు వృద్ధాశ్రమము చేరారుకాల మహిమ.

English:

The sapling your parents planted has worn out with time. The tree that was providing shelter has dried. The parents you brought up landed in old age home. Miracles of Times.

164.


అప్పు లీయబోకు పడకు యప్పు లందు

అప్పు లిచ్చిన చెరచును యది స్నేహ

మప్పు చేసి బ్రదుక యది ముప్పు తెచ్చు

తేట బలికెను  బాణి నాదు వాణి


తాత్పర్యము (తా):

ఎవరికీ అప్పులీయబోకుఎవరికీ బాకీ పడకునువ్వు అప్పులిస్తేఅది నీకుఅప్పు తీసుకున్నవాడికి మధ్య స్నేహాన్ని చెరుస్తుందినువ్వు అప్పులు చేస్తే నీకే ముప్పు తేవచ్చు.

English:

Neither a borrower nor a lender be. Because if you are borrower you will lose good friend. If you are lender you may be doomed.

165.

ప్రముఖుడిగ యుండు ప్రతిష్ట బాయ బోకు

చెంత చేర్చుము మిత్రుల చూసి యెంచి

వ్యర్ధ పరచకు విత్తము వినోదాల

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):

సమాజంలో  ప్రముఖుడిగా మెలగడం తప్పు లేదుకానీ నీ ప్రతిష్టను తాకట్టు పెట్టి ప్రాముఖ్యం సంపాదించుకోకు. (vanity) స్నేహితులను చేర్చేటప్పుడు వారి గుణగణాలను ఎంచి చేర్చుకోవినోదాల్లో  ధనాన్ని వృధా చెయ్యకు. (ఒక తండ్రి కొడుక్కి చెప్పవలసిన నీతులు)

English:

Strive to be prominent. But do not barter your honor for its sake. When you choose friends test their qualities. Never spend money on entertaining your friends. (Polonius’ Advice to his son: Hamlet)


166.



పిలువ ఉదయ భానుని వేల పూలు విచ్చె

వాలె సీతమ్మ చిలుకలు వేల లోన

నిన్ను మేల్కొలుపగ యమ్మ నీకు యొకటె

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):

ఉదయాన్నే సూర్య భగవానుణ్ణి మేలుకొలపడానికి వేలల్లో పూలు విచ్చుకున్నాయి.వేలాదిగా సీతాకోక చిలుకలు ఝుంకార శబ్దంతో పచ్చిక బయళ్ళ మీద తిరుగుతున్నాయినిన్ను గాఢ నిద్ర నుంచి  లేపడానికి ఉన్నది అమ్మ ఒకరే.

English:

To invite the Sun early in the morning, flowers bloomed in thousands. Thousands of butterflies are dancing on the fresh grass making humming noise. But to wake you up from deep slumber, only the mother is there. Remember her service.

167.


నీవు బుట్టినపుడె తల్లి నీదు బుట్టె

తల్లి యగు వరకును యామె తరుణి గాదె

జనమ దినమును యొకనాడె జరుపు కొనుడు

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):

నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మ కూడా పుట్టింది కదాఅంతవరకూ ఆమెతల్లి కాదు కదాకేవలం ఒక స్త్రీ మాత్రమేనువ్వు పుట్టిన రోజు సంబరం చేసుకునేప్పుడు ఆమె పుట్టిన (రెండో జన్మరోజు సంబరం కూడా జరుపుకోసబబుగా ఉంటుంది.

English:

When you were born your mother was also born. Till then she was an ordinary woman. So, when you celebrate your birthday, you celebrate hers also. It looks pleasant.

168.


హృదయ రాణిని వలతువు హృద్య ముగను

భార్య యన్నను యధికమౌ బ్రేమె గాని

అధిక సమయము నీ బ్రేమ యమ్మె పొందు,

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

నీ ప్రేయసిని మనసారా ప్రేమిస్తావుఅలాగే నీ భార్యను అంత కంటే ఎక్కువ ప్రేమిస్తావుకాని నీ ప్రేమను ఎక్కువ రోజులు పొందేది నీ తల్లేఎందుకంటే ఆమె వీరి కంటే ముందు వచ్చిందిఆమె ఙ్ఞాపకాలు  కల కాలం ఉంటాయి.


English:

You love your fiancee with heart. So too, you love your wife more than that. But mother receives your love more than anyone, as she entered your life earlier and her memories remain forever.





169.


మతము నవ మాస ములుండె గర్భ మందు

పురుష పాత్ర మతము నందు పరిమితంబు

ఆత్మ తాళపు చెవి యమ్మ గర్భ మేగ

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):
మన ఆత్మ తాళం చెవి అమ్మ గర్భంలోనే ఉంటుందిటఅందుకేమతంలో స్త్రీ పాత్రే ఎక్కువపురుషుడి పాత్ర చాలా తక్కువకానీ మనం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తాము.

English:

The key to our soul is the womb of mother. So, in religious matters role of woman must be more pronounced than that of the man. But we behave in the reverse.


170.


సృష్టి సేసెదు యమ్మకు కరము లెన్ని

వేయి సేతుల పనిసేయు యొడుపు గాను

వాణి కిస్తివె కరములు వేయి ధాత

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):               

విధాతానువ్వు అమ్మకిచ్చింది రెండు చేతులే కదాకానీ వేయి చేతులతో నిర్విరంగా పని చేస్తూనే ఉంటుందివాణికి మాత్రంవీణ వాయించేందుకు వెయ్యి చేతులిచ్చావు కదా!

English:

Oh! Creator! You gave mother only two hands. But she is working restlessly with thousand hands. But you granted thousand hands to Goddess Saraswati. (It is unconstitutional.)

171.


నీరు బుట్టెను కొండల రాళ్ళ నడుమ

రాలె ఘనిభవించిన నీరె రూపు మారె

పిలుపు లోన నేమి గలదు పట్టి చూడ

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా): నీరు రాళ్ళలోనుంచే పుడుతుందిమరి  రాళ్ళు ఘనీభవించిననీరే కదా పేరు పెట్టి పిలిచినా  పరమాత్మ మూలం ఒకటే కదా?

English:

Water sources from stones of mountains. The stones are nothing but solidified water over ages. Whatever name you call God the Source is one.


172.

శత్రు లున్న నీవు యాత్రము పడనేల

యొదిగి సాయ పడగ పదుగురకు

పాడు లోకము ఈర్ష్య పడదొకొ నీపైన

తేట బలికెను  బాణి నాదు వాణి!


తాత్పర్యము (తా):
నీకు శత్రువులున్నారని బాధ కించిత్తు పడనవసరం లేదునువ్వు ఒదిగి యుండిపదిమందికీ సాయం చేస్తే ఈర్ష్య పడే లోకంశతృత్వం పెంచుకోకుండా ఎలా ఉంటుంది?

English:

Never bother you have enemies. That means you lived a sober life and helped society. Out of jealousy many develop enmitytowards you. (Winston Churchill quote)

173.


విజయ మనగ కాదు వారధి ముందుకు

శిరము వంచగ నదియె శాప మగునె

ధైర్య మున్న వేళ దేవుడుండును తోడు

వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):
విజయం సాధించంగానే మన గొప్పతనమని విర్రవీగాల్సిన  అవసరం లేదుఅది ముందుకు పొయ్యే వారధిగానూ భావించ రాదుఅపజయమూ శాపం కాదుశిరసు వంచి నడవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు.విజయంలో కానీఅపజయంలో కానీ దేవుడ్ని తోడు చేసుకు నడవడం ప్రధానం.

English:

Success is not a bridge that takes you forward. No need to stretch your chest and boast. So too, defeat is not end of road. There is nothing wrong in kneeling your head a few moments. Whether in success or failure, take God along!

174.

ధైర్య మనిన ఎదురు బలుకుట కాదొకో

ఆగి వినుము పరులు యాడు నుడివి

వారి మాట లౌగ వారధి ముందుకు

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఎదుటి వారి మాట వినకుండా మనం చెప్పిందే సరి అని ముందుకు నడవడం పద్ధతి కాదుఒక్కో సారి వారి మాటలు నీ విజయ పధానికి వారధి అవ్వొచ్చు.

English:

It is not courage to walk past others’ words thinking what we do is right. Sometimes the words of advice by others may act as bridge to your path of success.

174.

నరక మేగ నడచి బోవుట మేలొకొ

వెనుక దిరిగి జూడ వెన్ను వణుకు

బదికి నన్న నాళ్ళు బడ్డది చాలదా

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నరకానికే వెళ్ళ వలసి వచ్చినప్పుడువెనుదిరిగి చూడకుండా నడిచి పోవెనక్కి తిరిగితేనువ్వు అనుభవించిన నరకం ఇంకా ఘోరంగా అగపడుతుంది.

English:

If are going to hell keep walking. (Winston Churchill) If you look back the hell you suffered all these years looks worse.

175.


నరక మేగ జెప్ప నాస్తికు తోడను

వింత లన్ని జూడ వేగ బోయె

యముని పూజ జేసె యమవేగ మను రాగ

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

నాస్తికుడికి నరకం వెళ్ళమంటే ఆనందంగా ఎదురు చూశాడట అదో విహార స్థలమేమోననిఅప్పటి నుంచీయముడిని ధ్యానించడం మొదలెట్టాడటత్వరగా తీసుకెళ్ళమని.

English:

When an atheist was told he may visit the hell he anxiously waited for the occasion, thinking it as a tourist place and started praying the Lord Yama, to take him there soon. (A quote)


176.

జయము కల్గను యప జయము లెన్నియొ

ఆశ విడిన కలుగు నాశ మున్ను

వేగ మేగి జేరు విజయ పధంబును

వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):

ఒక విజయం సాధించాలంటే ఎన్నో అపజయాల్ని ఎదుర్కోవలసి వస్తుందిఆశ విడిస్తే నాశనమే కలుగుతుందివేగంగా అడుగులేసివిజయ పథాన్ని చేరుకో.

English:

If you have to succeed in life you may have to face many a failure. Never leave hope. Continue the journey and reach the coveted goal.


177.


గాలి పటము ఎగురు గాలికి ఎదురుగ

గాలి వాట మున్న నిలుచు నటనె

ధైర్యమున్న వాడు ధార కెదురు బోవు

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):


గాలి పటం గాలికెదురుగా వేగంగా సాగుతుందిఅదే గాలి దాని కనుకూలంగా ఉంటేఅక్కడే ఆగి పోతుందిధైర్యమున్నవాడు ఏటికి ఎదురీదుతాడు.

English:

The courageous swims against the tide. He is like kite that goes up when wind is blowing against. If wind is following it stands still.


178.

మూర్ఖుడన్న నెవరు మనసున మారడు

వాద మైన నటులె సాగ దీయు

మనసు ఎటులొ యతని మాటయు యటులనె

వాణి బలుకు మాట నాదు నోట!




తాత్పర్యము (తా):

మూర్ఖుడు మనసులో మారడువాదాన్ని కూడా అలానె సాగ దీస్తూ ఉంటాడుఅతని మనసు ఎలా ఉంటుందో మాట కూడా అలానే ఉంటుంది.

English:

A fool never changes his attitude. His arguments also rest on absurdity. His words are a reflection of his mental state.

179.

కప్పురంబు నుప్పు కానగ నొకటియె

చూడ చూడ ధరల జాడ వేరు

ధనిక పేద తేడ కొనగను తెలియురా

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఉప్పూకర్పూరమూ చూడడానికి ఒకలానే ఉంటాయికానీ ధరలలో చాలా తేడా ఉంటుందిఅలాగే ధనికుడూపేద వాడూ ఒకలానే ఉంటారు.  వారు కొనే దుస్తులూవస్తువుల్లోనే బెధం కొట్టవచ్చినట్టు కాన వస్తుంది.


180.


తల్లి జబ్బు బడగ తనయుండు యొక్కడె

జూడ వలయు కాడు జేర్చ వలయు

తద్దినంబు బెట్ట తనయు లందరి హక్కు

వాణి బలుకు మాట నాదు నోట!




తాత్పర్యము (తా):

తల్లి జబ్బు పడితే చూడ వలసిన బాధ్యత చిన్న కొడుకులేదట. ఆమె పోయినప్పుడు కర్మ కాణ్ద జరపడానికి మాత్రం అందరూ అర్హులే. ఇదెక్కడి శాస్త్రం. 

English:

If mother is on bed the younger ones should take care of her. But when she passes away, all the sons are there to perform final rites.

181.

బతికి యుండ ముద్ద బెట్టగ గడు రోత

బోవ తల్లి దండ్రి బెద్ద కొడుకె

పెద్ద పిండ మొకటి బెట్ట బొందును హక్కు

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

మన ఆచారాలు చాలా వింతగానూవిసుగు గానూ ఉంటాయితల్లి జబ్బు పడి మంచాన పడితే చూసే బాధ్యత ఎక్కువగా చిన్నవాడి మీద ఉంటుందికానీ పిండ ప్రదానం చెయ్యడానికి పెద్దవాడే అర్హుడటఇద్దెక్కడి చోద్యమో!

English:

Our religious procedures a bit funny and vexing. If mother or father turn ill and are confined to bed, in most cases the responsibility of looking after her falls on the younger ones. But the eldest is only eligible to perform final rites.



182.


సదాచార మనిన సంపత్తి బెంచుటె

దురాచార మనెదె దాన మివ్వ

మనసు మంచి దైన మంచి వాడగునొకొ

వాణి బలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):

సమాజం ఎంత కుళ్ళి పోయిందంటేఎవరన్నా డబ్బు ఉన్న వాడిని చూస్తే వాడు చాలా పెద్ద మనిషివాడి సంపత్తి వెనుక రహస్యం ఎవరికీ తెలియదుకానీ ఎవరైనా దాన ధర్మాలు  చేసి పేదవాడయితేవాడికి గుర్తింపు ఉండదువాడు చేసిన ధర్మమూ ఎవరూ పట్టించుకోరువొళ్ళు  పొగరుఅనే అవకాశం కూడా ఉందిమనసు మంచిదైన వాడు ఎప్పుడూ మంచి వాడు గానే మిగులుతాడు.

English:

The society is so rotten that if anyone accumulates wealth, his source of wealth is not probed. But he is respected as gentleman. If anyone donates his belongings to charity, he is considered a pauper. His charity is forgotten. He might be blamed with arrogance.

183.


కాడు చేరు వేళ కాకి యౌనె కోకిల

వంద యేళ్ళ  వేము గంధ మగునె

పసి తనపు గుణము పాడెపైనను బోదు

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

జీవితం చివరి ఘట్టంలోకాకి కోకిల అవుతుందావంద ఏళ్ళు బ్రతికినావేప చెట్టు గంధపు చెట్టుగా మారుతుందాచిన్నతనంలో ఉన్న గుణాలు సామాన్యంగా మారవు ఎవరో మహానుభావులకి తప్ప.

English:

Will a crow turn to cuckoo even at the time of its final stage? Will a neem tree that lived hundred years, turn to sandalwood tree? Will a person’s childhood qulaities change except in case of some saints?

184.


ఆరు గుణము లెంచ యరి షడ్వర్గులు

చేయు మొదటి రెండు చేటు తనకె

నాల్గు మిగుల చెరచు నలుగురి బ్రతుకులు

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

అరి షడ్వర్గాలు  ఆరుదాంట్లో మొదటి రెండూ కామమూక్రోధమూ ఉన్నవాడికే హాని కలిగిస్తాయిమిగిలిన నాలుగూలోభమూమోహమూమదమూమాత్సర్యమూ మనిషిని దహించడమే కాకుండా వేరె వాళ్ళకీ హాని కలిగిస్తాయి.


English:

There are six internal enemies to a human. In those the first two, desire and anger do harm to the person having them. The other four miserliness, attachment, arrogance and jealousy burn the man fro inside and also do harm to others.


185.


మోహ లోభ మదము మాత్సర్యములు నాల్గు

చేటు చేయు నీదు తోటి వార్కి

కామ క్రోధ గుణము కాలుని కడ బంపు

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

లోభమోహమదమాత్సర్యాలు తోటి వారికి హాని కలిగిస్తాయికామక్రోధాలు నిన్నే దహించి నీ అంతం చూస్తాయి.

English:

Miserliness, attachment, arrogance and jealousy cause irreparable harm to the others, whereas the two enemies anger and desire burn you from within and see youe end.



186.

ఊరువూరు బోగ ఉప్పెన వచ్చియు

బతికి బట్ట గట్టి బారి పోగ

యతని పేర సొమ్ము యధికారి మింగెరా

వాణి బలుకు మాట నాదు నోట!



తాత్పర్యము (తా):

ఉప్పెనలో ఊరుఊరు కొట్టుకు పోగా మిగిలిన కొంతమందీ కట్టు బట్టలతో ఊరు విడిచి పారి పోగా వారినీ పోయిన వారి లెక్కలో వ్రాసి వారికొచ్చిన సొమ్మును దొంగ ఖాతాల్లో వేసి దోచుకున్నాడో  అధికారి. (ఇది దివి సీమ తుఫానులో జరిగిన యదార్ధ ఘటన)

English:

When the whole village was washed away in a hurruicane and few who survived fled with clothes on, an officer declared them as dead, opened fake accounts in their names and withdrew the compensation. (This happened during the Divi Seema Cyclone)

187.


యుమ్మ రాదొ యచటె యుమ్మెద మేము

స్వఛ్ఛతన్న మనకు యచ్చి రాదు

హక్కులన్ని మనము హవనము సేయమే

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

మన సంస్కృతి ఎలా ఉంటుందంటేఎక్కడ "ఉమ్మి వేయ రాదుఅని వ్రాసి ఉంటుందో అక్కడే ఉమ్మేస్తాముఎవడొస్తాడో చూద్దామనిస్వఛ్ఛంగా ఉండడం మనకి అచ్చి రాదుహక్కుల మంత్రాలతో రొజూ హవనం (హోమంచేస్తూ ఉంటాము. (అంటే హక్కులను మాత్రం పూజిస్తూ ఉంటామని

English:

Our culture is such that, without fear of law, we spit where we are prohibited to spit. We feel cleanliness is not our forte. We go after our rights and fight for them.

188.


యెర్ర దీప కాంతి యాగుట కొరకును

పచ్చ దీపముండు పరుగు యాప

పసుపు చూడగానె పరుగిడి పోదుమో

వాణి బలుకు మాట నాదు నోట!



తాత్పర్యము (తా):

ట్రాఫిక్ సిగ్నలు దగ్గర ఎర్ర దీప కాంతి ఆగమనిపచ్చ దీప కాంతి నెమ్మదిగా రమ్మనికాని మనం పచ్చ దీపం చూడగానే పరుగెట్టి పోయి కింద పడతాము కదా!

English:

There is significance in the colors of traffic signals. Red lamp indicates vehicles should stop. Yellow (or orange) lamp indicates we should slow down. But soon after we see the yellow lamp,we increase speed and cause accidents.

189.

హరుడు మింగె నాడు హాలాహలమ్మును

లంచ గొండి నేడు లంచ మున్ను

కంఠ మందె రెండు కరగవు తరగవు

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

శివుడు హాలాహలాన్ని మింగి లోకాల్ని రక్షించాడు రోజు లంచ గొండి లంచాలు మింగి లోకాల్ని దోచుకుంటాడుశివుడు హాలాహలన్ని కంఠంలో ఉంచుకుంటేలంచగొండి గొంతులోనే లంచం మిగిలి పోతుందిరెండూ మింగుడు పడవుఒకటి లోక రక్షణార్ధం కాబట్టిరెండోది భక్షించాడు కాబట్టి.

English:

Lord Shiva swallowed poison to rescue the worlds. Corrupt is swallowing bribe to loot the nations. Lord Siva retained the poison in his throat so that it does not cause to him. The corrupt is unable to swallow so much wealth and is bringing doom to himself.


190.


కలసి రాని వేళ కర్మ ఫలమనియె

ధనము చేరగానె తనదె మహిమ

లక్ష్మి పూజ చేసి లాలూచి యేలొకొ

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

కలిసి రాని వేళ మనుజుడు కర్మ ఫలమని తిట్టుకుంటాడుధనం చేరగానే తన మహిమే అనుకుంటాడుమళ్ళి లక్ష్మి  పూజ చేసి అత్యాశ  ఇంకా ఎందుకు?

English:
When time is not favoring, he blames the God and Karma.

191.


ఆడ బిడ్డ పెరిగి యత్త ఇంటికి వెళ్ళె

బిడ్డ కనియె ముద్దు బిడ్డలన్ను

యయిన అత్త యెడుట యలుసేన తన తండ్రి

వాణి బలుకు మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

ఆడ బిడ్డ పుట్టిపెరిగి అత్త వారింటికి వెళ్ళిందిఆమె మళ్ళీ పిల్లల్ని కన్నదిఅయినా ఇంకాబిడ్డ తండ్రి ఆమె అత్త వారింట్లో తలవంచుకుని ఉండాల్సిందేనా! (ఇది మన సంస్కృతిలో భాగ మయ్యింది.దురాచారమే కదా)

English:

A bad precedent is ingrained in our culture that the father of a girl, married long back and who has children come of age, still is treated with contempt in her in-laws’ house.


192.


బతుకు చావు మధ్య వెతబడు మగనికి

కూడు బెట్ట తాను పడుపు గాగ

పతిత యండ్రు జనులు పతివ్రత కాదొకొ

వాణి బలుకు మాట నాదు నోట!   

తాత్పర్యము (తా):

చావుబ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న మగనికి కూడు పెట్టడానికిమందుమాకు సమకూర్చడానికిఒక ఆడ బిడ్డ వేరే పని దొరకక పడుపు వృత్తి లో దిగితే ఆమె పతిత ఎలా అవుతుంది పతివ్రతల జాబితాలో ఎందుకు చేర్చరు.

Enlish:

A woman who, unable to get other work and goes into the world’s oldest profession, to feed her bed-ridden husband and providing medicare to him, is called a sinner. Why do we not join her in the list of the “sacred”?




193.

ఆశ తోడ యడవి యాశవాది బతుకు

వాగు సేయు సద్దు విస్మయము గొలుప

పాము తలను జూచు విలువైన మణియొండు

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

ఆశావాదిని అడవి మధ్యలో వదిలితేవాగులు చేసే శబ్దాన్ని సంగీతంలాగ ఆనందిస్తాడుపాము కనబడితే భయం లేకుండా దాని తలపై ఉన్న మణి అందాన్ని గ్రోలుతాడు.

English:

The optimist lives with hope in the midst of a forest. He enjoys the sound of the streams and if he finds a snake, he enjoys the the gem on its head instead of fearing it. (Shakespeare: As you like it.)



194.


కోడలొచ్చిన కొడుకుకు కట్టడేల 

పుట్ట మనవడు పండుగ జరుప నేల

ఏల దుర్గతి పట్టెను ఇట్టి రీతి

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

కోడలు ఇంటికి రాగానే కొడుకు మీద ఎన్నెన్నో ఆంక్షలుఅదే కోడలు మనవడిని కంటే పండుగ చేసుంటారు కదామళ్ళే అదే కోడలు తనకి కోడలొస్తే ఇదే పద్ధతి పాటిస్తుందిఎప్పటికి మారేను?

English:

When daughter-in-law enters house, so many restrictions are placed on the movements of son. If the same daughter-in-law gives birth to a boy, a festival atmosphere prevails. The daughter-in-law, when she becomes a mother-in-law follows the game. When do we change?

195.

భామ దొరుకక తలడిల్లె బ్రహ్మచారి 

భార్య కావలెనంచును బ్రకటనిచ్చె

ఆడ మగవారి నిష్పత్తి యడ్డు తగిలె 

తేట బలికెను  బాణి నాదు వాణి.!

తాత్పర్యము (తా):

భార్య కావాలని బ్రహ్మచారి ప్రకటనిస్తేభార్య కావడానికి ఆడ పిల్లలేరి? వారిని పుట్టనిస్తే కదాబ్ర్హ్మచారి ఎంత తల్లడిల్లినా ఆడ-మగ నిష్పత్తి అడ్డమొచ్చె కదా?

English:

Bachelor gave an advertisement for an eligible wife. Where are girls to marry? They were not allowed to be born. Howsoever he struggles the ratio of men and women came in the way.

4.12 కోట్ల మగవారు పెళ్ళి కాక ఇబ్బందులు పడుతున్నారన్న వార్త చూసి.


196.


తెలివి తల్లిది తండ్రిది కలిమి తనకు

ఆస్తి వారిది వారిపై ప్రేమ నాస్తి

పంచు కొనగను తుదకుండె తల్లి దండ్రి

తేట బలికెను  బాణి నాదు వాణి!  


తాత్పర్యము (తా):

సంపాదించే తెలివితేటలు తండ్రివికాని ఆయన కలిమంతా కొడుకులదిచివరికి తండ్రి ఎవరి దగ్గరతల్లి ఎవరి దగ్గర అని పంచుకోడానికి మాత్రమే వారు మిగిలారా?

English:

The brain behind the accumulation of wealth is the father’s. The sons shared the beauty. Finally, the parents remained to be shared between the sons, where mother and where father!



197.


సవ్య సాచిల బెంచెను సంపదన్ను

కొడుకు లేకనె చివరకు కాటి కేగ

లంచ ముచ్చుకు బడుగుడు నిప్పు బెట్టె

తేట బలికెను  బాణి నాదు వాణి!  


తాత్పర్యము (తా):

లంచాలు రెండు చేతులతో పుచ్చుకునిసవ్యసాచిలా సంపదను పెంచాడుపోయే సమయానికి కొడుకులెవరూ దగ్గర లేకపోతేకాటి కాపరే లంచం పుచ్చుకుని చితికి నిప్పు పెట్టాడటచేసుకున్నవారికి చేసుకున్నంతమహా దేవా!

English:

He earned immense wealth by earning through bribery with both hands. Ultimately when he passed away no son was near him. The coroner took bribe and cremated him. What he did to others, God did to him!

198.


తీపి యమ్ము వాని మనసు తీపి పయిన

వంట చేయు వాని మనసు వాసనందు

న్యాయ నిపుణుని బాసలు న్యాయ మందు

తేట బలికెను  బాణి నాదు వాణి!

తాత్పర్యము (తా):

తీపి పదార్ధాలు అమ్మే వాడికి తీపి మీద మనసుంటే ఇంకా ఏం మిగులుతుందిఅలాగేవంట చేసే వాడి మనసు వాసన మీదుంటే వంటేం చేస్తాడున్యాయ నిపుణుడు న్యాయం చేస్తానని బాసలు చేసుకుంటూ  పొతేమిగిలేది బాసలేన్యాయం కాదు.

English:

If the vendor of sweets thinks about the taste of sweets, what will remain to be sold. If a chef has his mind on the smell of his recipes, what will he cook. Like that, if the legal expert goes on boating about providing justice, only the boast remains, justice goes for a toss!

199.

బడులు తెరువ బాల బ్రహ్మలు కదిలిరి
వాణి వెదుక యందున వాసి గాను
ఙ్ఞాన తృష్ణ తోడ ఙ్ఞా నుల చెంతకు
వాణి బలికెను  మాట నాదు నోట!

తాత్పర్యము (తా):

 పద్యం మా మనవడిని బడిలో దించి అక్కడే కూర్చున్నప్పుడు వ్రాసినదిబడులు తెరవగగానేబాల బ్రహ్మలు కదిలివచ్చారుబడిలో ఉన్న తమ వాణిని (సరస్వతీ దేవినివెదుక్కుంటూవిఙ్ఞానాన్ని కూడగట్టుకోడానికి ఙ్ఞానుల (ఉపాధ్యాయినులవద్దకు.

English:

I wrote this poem when I dropped by 2.5 yr old grandson in school and was waiting for him outside, inspired by the flow of small kids.

The kid Brahmas came in search of their Vaani (Sarasvati Devi) in the school. They came with an urge to attain knowledge from the knowledgeable. (Teachers)




201.

మాత వెడలె ప్రేమ మనసున నిండగ
కదల మన్న యచటె కాపు కాసె
దేవు డుండు తల్లి దయలోనె ఎపుడును
వాణి బలికెను  మాట నాదు నోట!


తాత్పర్యము (తా):

పిల్లల్ని క్లాసు రూముల్లో దించి తల్లులు బయటికి వచ్చారు కానిఇంటికి వెళ్ళండిగేట్లు వేస్తామంటే ఒక్కరూ కదలరేఆహా
తల్లి ప్రేమలోనేదేవుడుంటాడెమో కదా!

English:

Mothers left children in classroom. But they are not willing to go home even if school authorities wanted them to leave. They stay there only under a tree, in cars, on scooters. Wonder! God lives in mother’s love only!

201.


వేసవందు వేడి వాన వచ్చెను రొచ్చు

తృప్తి లేని వాడి తీరు యటులె 

భార్య యుండ వెదుకు బయట సుఖము కోరి

వాణి పలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):

అప్పటి వరకు ఎండ వేడిని తట్టుకోలేక వేసవిని తిట్టిన వాళ్ళేవాన పడగానే రోడ్లన్నె చిత్తడిగా ఉన్నాయని తిట్టుకుంటారు కదాతృప్తి లేకపొతే ఇంతే కదాఇంట్లో భార్య ఉండగా పరాయి స్త్రీ వెనకాల తిరిగే తత్వం ఇదే కదా!

English:

Those who blamed summer for the severe heat wave, start blaming the rainy season as the roads become wet and unwalkable. We do not be satisfied with what God gives, like a man that goes behind other women keeping his wife at home.



202.


నీటి కొరకు పోయి నాలుగు క్రోసులు

నాతి నడువ బిందె నీరు మోస్కు

నోట చొంగ కార నిలుచుండి చూసెదె

వాణి బలుకు మాట నాదు నోట!  

తాత్పర్యము (తా):

నీళ్ళు దొరక్క నాలుగు మైళ్ళు నడిచి నీటి బిందెను నెత్తిన పెట్టుకొని తిరిగి వచ్చే భామల వయ్యారాలను చూస్తూ చొంగ కార్చుకో పోతే కాసింత సహాయం చెయ్యవచ్చు కదా!

English:

In drought hit areas, when women walk four miles to fill a pot of water and walk back with it on their head, you stand on roadside and enjoy thir beuty, Instead, cant you lend a helping hand?


203.

వాన కురవ దనియె వాతా వరుణుడయ్యొ

వరుణు డేమొ నవ్వి వింత జూడ

కురిసి పోయె వాన కుక్కలు పిల్లులు (cats and dogs)

వాణి పలుకు మాట నాదు నోట!


తాత్పర్యము (తా):

వాతావరణ నిపుణుడు వాన కురవదు అని కచ్చితంగా లెక్కలు వేసి చెప్పగానేఇదేదో తమష చూద్దామన్నట్లుగావఋణ దేవుడు భారీగా వర్షం కురిసి పోయాడుట.

English:

Soon after the weatherman made calculations and predicted that there would be no rain, to see fu the rain Gods poured cats and dogs.

204.

నారు పోయు వాడె నీరు పోయు ననుచు

కల్లు తాగి దొరలు కలలు కనగ

యెన్నుకున్న వాడు యెట బోయి యేడుచు

వాణి బలుకు మాట నాదు నోట!



తాత్పర్యము (తా):

నారు పోసిన వాడే నీరు పొస్తాడు అనిదొరలు కల్లు తాగి కలలు కంటూ ఉంటే వారిని ఎన్నుకున్న సామాన్యుడిని  దేవుడు రక్షిస్తాడు?

English:

“The God that sowed the seed would himself water the fields.” Thinking so, if the elected drink toddy and dream in deep sleep where will the common bvoter who elected them go?

205.

గురువు శిష్యు లెవరు గురుతు పట్టగ లేము
సార మెల్ల ఇపుడు సార యందె
గురువు తాగ జూసి కునుకుతేసెను చట్టు
వాణి పలుకు మాట నాదు నోట.
చట్టుశిష్యుడు

తాత్పర్యము (తా):

గురువెవరోశిష్యుడెవరో గుర్తు పట్టే స్థితే లేదుఙాన సారమంతా సారా లోనే ఉందిగురువు తాగితేశిష్యుడు  మత్తులో జోగుతున్నాడుట.

English:

The difference between the teacher and student is thinning. When the teacher is fully drunk, the student is napping in the intoxication.

VANI+CHANDRA 38 years of happy living.

Traveling in Italy. Our life has been an arduous journey through lakes and rocks.


We might have covered tens of thousands of miles in various countries.

WAITING FOR THE CALL

SHE TURNS 60 (Shashti Poorthi on 30th June.) My gift to her, 200 poems.





No comments:

Post a Comment